మనలో చాలామంది చిన్నచిన్న పొరపాట్లు చేసి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. నిద్ర విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. కొంతమంది రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు. అయితే అతినిద్ర వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
పోషకాల లోపం వల్ల కలిగే సమస్యల్లో నిద్ర సమస్య ఒకటి కాగా పూర్తిగా నిద్రపోయిన తర్వాత కూడా అలసిపోయినట్లు లేదా నిద్రమత్తులో ఉన్నట్లు అనిపిస్తే శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపం ఏర్పడిందని గుర్తుంచుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల అధిక నిద్ర సమస్య వస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ఈ సమస్యతో బాధ పడేవాళ్లు బలహీనంగా, అలసటగా, బద్ధకంగా ఉండే అవకాశం ఉంది.
విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్ సమస్య కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్ డి మన శరీరంలో కాల్షియం, ఫాస్పరస్‌ను గ్రహించడంలో కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విటమిన్ డి లోపం వల్ల బలహీనమైన ఎముకలు, కండరాల నొప్పి, నెమ్మదిగా జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనపడే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
శరీరానికి అవసరమైన విటమిన్లలో బీ12 ఒకటి కాగా విపరీతమైన అలసట, నిద్ర వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నాడీ సంబంధిత సమస్యలు, బలహీనమైన కండరాలు, చిరాకు, వేగవంతమైన హృదయ స్పందన సమస్యలకు సైతం విటమిన్ బీ12 లోపం కారణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అతినిద్ర సమస్యతో బాధ పడేవాళ్లు వైద్యులను సంప్రదిస్తే మంచిది.