బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్మ సౌందర్యాన్ని పొందొచ్చు. ఎలాగంటే.?

yogurt-curd-for-smooth-skin-social

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ పరుగులు పెడుతూ కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నారు. దీనివల్ల కృత్రిమ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది శాశ్వత పరిష్కారం లభించకపోవడం అనేక చర్మ ఇన్ఫెక్షన్లకు, అలర్జీలకు కారణమవుతుంది. కావున చిన్నపాటి శ్రమతో కొన్ని వంటింటి చిట్కాలను పాటిస్తే సహజ పద్ధతిలో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

అరటిపండు,బొప్పాయి పండ్ల గుజ్జు చర్మ సౌందర్యాన్ని కాపాడి వృద్ధాప్య ఛాయాలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా అరటిపండును మెత్తటి గుజ్జుగా మార్చుకొని ముఖ చర్మంపై సున్నితంగా మర్దన చేసుకుంటే చర్మంపై ఉండే మృత కణాలను తొలగించే కొల్లాజన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది.తద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. బాగా మాగిన బొప్పాయి గుజ్జును తీసుకొని అందులో కొంత బియ్యప్పిండి, ఆరంజ్ నూనెను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

 

పచ్చి బంగాళదుంపల నుంచి రసాన్ని తీసి ఆ రసంతో

తరచూ ముఖం కడుక్కుంటే పొడిబారిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.మరియు నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంపను ముక్కల్లా తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత తీసి కళ్ల కింద రుద్దుకోవాలి. కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.

 

తేనెలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోనీ పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే మృత కణాలు,నల్ల మచ్చలు తగ్గి సహజ పద్ధతిలో చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ బియ్యప్పిండి, ఒక స్పూన్ పాలు వీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అర గంట త‌ర్వాత క్లీన్ చేసుకుంటే పొడి వారిని చర్మం కాంతివంతంగా తయారవుతుంది.