ఇంట్లో బొద్దింకల బెడదా..! చిన్న చిట్కాలతో తరిమేయండి..!!

బొద్దింకలను చూస్తే మహిళలు భయపడతారు. మురికి గుంటల్లో ఎక్కువగా ఉండే బొద్దింకలు ఏకంగా వంట గదిలోకి వస్తే ఎంత ఇన్ఫెక్షన్ ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది మరి. ఇవి ఆహారంపై పడితే చేరే ఈకొలి బ్యాక్టీరియా ప్రమాదకరమైంది. బొద్దింకలను పోగొట్టేందుకు స్ప్రే వాడుతూంటాం. కానీ.. అదే స్ప్రే ఇంట్లోని మిగిలిన వస్తువులపై.. ఆహార పదార్ధాలపై పడినా మనకు ప్రమాదం. పిల్లలకు మరీ ప్రమాదం. ఇందుకు స్ప్రేలు కాకుండా వంటింటి చిట్కాలతో బొద్దింకలకు చెక్ పెట్టొచ్చు.

ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, బూజు దులిపేయండి. ఇల్లు, వంటగది శుభ్రంగా లేకపోతేనే బొద్దింకలు చేరతాయి. వంటింట్లో వేడిగా ఉన్నచోట, ఆహార నిల్వలు, దుమ్ము ఎక్కువగా ఉన్నచోట చేరతాయి. కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. భోజనం అయిన వెంటనే అక్కడ శుభ్రం చేయాలి. రాత్రి ఫుడ్ అయ్యాక వేస్ట్ ని మూత ఉన్న డస్ట్ బిన్ లో వేసేయాలి. సామాన్లు కూడా క్లీన్ చేసేసుకోవడం ఉత్తమం.

మనం ఉపయోగించే హెయిర్ స్ప్రే వల్ల కూడా బొద్దింకలు రాకుండా చేయొచ్చు. బొద్దింక కనపడగానే స్ప్రే చేయాలి. దీని వల్ల కదలలేక, రెక్కలు విదల్చలేక ఉన్నచోటే ఉండిపోతాయి. కాసేపటికి చనిపోతాయి. లేదంటే చీపురుతో బైటకు ఊడ్చేయొచ్చు. బిర్యానీ ఆకు ద్వారా కూడా బొద్దింకలను తరిమేయచ్చు. బిర్యానీ ఆకుకు ఘాటెక్కువ. ఇదే బొద్దింకలకు నచ్చనిది. వంటింట్లో బొద్దింకలు తిరుగుతున్న చోట వీటిని ఉంచితే బొద్దింకలు రావు.

అమ్మోనియా వాసన కూడా బొద్దింకలకు పడదు. అమ్మోనియా తో ఇల్లు శుభ్రం చేసుకున్నా బొద్దింకలు రావు. అమోనియా కలిపిన నీళ్లతో ఇల్లు శుభ్రం చేయొచ్చు. ఇదొక సింపుల్ ట్రిక్. మరో సులువైన పద్ధతి స్టిక్కీ టేప్. బొద్దింకలు సులువుగా వీటి ట్రాప్ లో పడి చనిపోతాయి. గది మూలల్లో, వంటింట్లో, బొద్దింకలు తిరిగేచోట రాత్రిళ్లు ఉంచితే.. బొద్దింకలు వాటికి అతుక్కుపోతాయి. ఇదొక ట్రిక్.

బొద్దింకల ద్వారా ఈ కొలి బ్యాక్టీరియా వస్తుంది. అలానే సాల్మోనెల్లా కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. బొద్దింకలు మరీ ఎక్కువగా ఉంటే ప్రొఫెషనల్ కంపెనీల సాయం తీసుకోవచ్చు. వాళ్లు వచ్చి ఇల్లు క్లీనింగ్ చేయడం ద్వారా బొద్దింకలను తరిమేస్తారు. ఈ పద్ధతుల ద్వారా బొద్దింకల బెడదను తప్పించుకోవచ్చు.

 

గమనిక: ఆరోగ్య నిపుణులు ఆయా సందర్భాల్లో వెల్లడించిన అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా.. వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.