ముక్కుదిబ్బడ సమస్య తరచూ వేధిస్తోందా.. చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఇవే!

మనలో చాలామందిని ఎక్కువగా వేధించే సమస్యలలో ముక్కుదిబ్బడ ఒకటి కాగా అలర్జీలు, వాతావరణంలో మార్పుల వల్ల ఎంతోమంది ఈ సమస్యతో బాధ పడుతుంటారు. చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల నిద్ర సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పవచ్చు.

ముక్కుదిబ్బడ సమస్య వేధిస్తుంటే వెంటనే కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. ఆవిరి పట్టడం వల్ల ఈ సమస్య సులువుగా దూరమవుతుంది. వేడినీటితో ఆవిరి పడితే ముక్కు బ్లాకేజ్ త్వరగా క్లియర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మరగ కాచిన నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకొని పీల్చడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ముక్కుదిబ్బడ సమస్య దూరమవుతుంది.

గోరువెచ్చని నీళ్లు, హెర్బల్‌ టీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా ముక్కుదిబ్బడ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు సులువుగా దూరమయ్యే అవకాశం ఉంటుంది. హ్యుమిడిఫయర్‌ వాడటం వల్ల గొంతులో గరగర, దగ్గు, సైనస్‌ సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వెచ్చని కంప్రెస్‌ను వాడటం ద్వారా కూడా ముక్కుదిబ్బడ సమస్య దూరమవుతుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా కూడా ఈ సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆవనూనె వాసన పీల్చడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుంది. ఈ చిట్కాలు పాటించినా సమస్య పరిష్కారం కాకపోతే వైద్యులను సంప్రదిస్తే మంచిది.