Hand Wash: చేతులు కడుగుతున్నారా..? శానిటైజర్ ఎక్కువైతే కొత్త సమస్యలు

Hand Wash: కరోనా వచ్చి ప్రజల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహనను రెట్టింపు చేసింది. చేతులు కడుక్కుంటేనే ఆరోగ్యం అని గుర్తు చేసింది. కారణం.. మనం ఆహారం తినేటప్పుడు అరచేతులు, వేళ్లు, గోళ్లు కూడా మన నోటిలోకి వెళ్తాయి. అంటే.. వీటన్నింటినీ శుభ్రంగా కడుక్కోవాల్సిందే. లేదంటే.. ఏం తిన్నా చేతికి ఉన్న క్రిములు శరీరంలోకి వెళ్లి చేయాల్సిన హాని చేసేస్తాయి. ఈక్రమంలో మన చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు తప్పనిసరి అయ్యాయి. ఎక్కడికెళ్లినా.. జేబులో పట్టే కెమికల్ శానిటిజైర్ రాసుకుంటే అదో భరోసా. కానీ.. ఇది ఎక్కువైతే చాలా ప్రమాదమంటున్నారు. నిపుణులు.

నిజానికి రెండు గంటలకోసారి చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్పింది. దీంతో.. ఏది ముట్టుకుంటే కరోనా వస్తుందేమో.. అనే అనుమానంతో చేతులు శానిటైజ్ చేసేస్తున్నారు. కానీ.. ఇది సరైన పద్ధతి కాదని.. చెడు బ్యాక్టీరియాను తరిమేసే క్రమంలో మనం చేతుల్లోని మంచి బ్యాక్టీరియాను మనకు తెలీకుండానే తరిమేస్తున్నామని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే పనిగా మన చేతుల్ని కడిగేస్తే మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. అందుకే శానిటైజర్, సబ్బుల్ని ఎక్కువగా వాడొద్దంటున్నారు.

ఇలా చేయడంవల్ల అబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) అనే మానసిక సమస్య వస్తుందని కూడా అంటున్నారు. ఈ OCD అటాక్ అయితే జీవితాంతం వెంటాడుతుందని.. ఎప్పుడూ చేతులు కడుగుతూనే ఉంటారని అంటున్నారు. అందుకే OCD రాకుండా చూసుకోవడం ఉత్తమం. OCD ఉన్నవారు అందరిలో కలవలేరు. ఏదో ఇబ్బంది ఉన్నట్లు ఫీలవుతారని నిపుణులు అంటున్నారు. కానీ.. ప్రస్తుతం అందరూ శానిటైజర్లు విరివిగా ఉపయోగిస్తున్నారు. పరిస్థితులు అలా వచ్చేశాయి. దీనిని కాదనలేం. కానీ.. అతి మంచిది కాదంటున్నారు నిపుణులు.

శానిటైజర్‌లో రకరకాల కెమికల్స్ ఉంటాయి. మన చేతులకు అంటుకున్న కెమికల్స్.. మనం ఏదైనా తిన్నప్పుడు శరీరంలోకి వెళ్లిపోతాయి. వికారం తెప్పిస్తాయి. అందుకే.. శానిటైజర్ బదులు సబ్బు వాడటం ఉత్తమమని అంటున్నారు నిపుణులు. శానిటైజర్ ఎక్కువగా వాడటం వల్ల చర్మం పొడిబారిపోతుంది. కూడా. మళ్లీ తేమగా మార్చుకోవడానికి మాయిశ్చరైజర్లు వాడాలి. ఇదొక ఇబ్బంది. అందకే.. సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం ఉత్తమం.. ఇంకా చెప్పాలంటే సబ్బు.. శానిటైజర్.. అవసరమైనప్పుడే వాడితే మరీ మంచిదంటున్నారు నిపుణులు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆరోగ్య నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆరోగ్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.