చికెన్ తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తాయా?

మనలో చాలామంది చికెన్ ను ఎంతగానో ఇష్టపడతారు. కొంతమంది భోజనం చేశారంటే తమ ఆహారంలో చికెన్ కచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే చికెన్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టం అంతాఇంతా కాదు. తరచూ చికెన్ ను తినేవాళ్లు చికెన్ తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ను తెలుసుకుంటే మంచిది. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ లెవెల్స్ పెరుగుతాయి.

 

మటన్ తో పోల్చి చూస్తే చికెన్ రేటు తక్కువ కావడం వల్ల కూడా ఎక్కువమంది చికెన్ ను తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చికెన్ ను కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత త్వరగా వండాలి. ఆలస్యంగా చికెన్ ను వండటం వల్ల చికెన్ పై బ్యాక్టీరియా పెరిగి వేర్వేరు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. నిమోనియా, డయేరియాతో పాటు ఊపిరి సంబంధిత సమస్యలకు చికెన్ కారణమవుతుందని చెప్పవచ్చు.

 

చికెన్ ను ఎక్కువగా తినేవాళ్లకు క్యాన్సర్ ముప్పు ఎక్కువని పరిశోధనల్లో తేలింది. చికెన్ ను ఎక్కువగా తినేవాళ్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. చికెన్ తినేవాళ్లు బరువు మరీ ఎక్కువగా ఉంటే కొంతకాలం పాటు చికెన్ కు దూరంగా ఉంటే మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చికెన్ ఎక్కువగా తినేవాళ్లలో యూరిక్ ఆసిడ్ పెరిగి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

 

ప్రతిరోజూ చికెన్ తినేవాళ్లు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. చికెన్ ఎక్కువగా తినేవాళ్లు ఈ విషయాలను గుర్తు పెట్టుకుని ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వారంలో ఒకటీ రెండుసార్లు చికెన్ తీసుకుంటే పరవాలేదని హోటళ్లు, రెస్టారెంట్లలో తినడం కంటే ఇంట్లో వండుకుని చికెన్ ను తినడం మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తుండటం గమనార్హం.