మనలో చాలామంది నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగే అలవాటును కలిగి ఉంటారు. అయితే నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగడం వల్ల లాభమా? నష్టమా? అనే ప్రశ్నకు నష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలా తాగడం వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అదే సమయంలో నిలబడి నీళ్లు తాగడం కంటే కూర్చుని నీళ్లు తాగడం మేలని తెలుస్తోంది.
కూల్ వాటర్ ను తీసుకోవడానికి బదులుగా నార్మల్ వాటర్ ను తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశంతో పాటు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఉదయం సమయంలో గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు సైతం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. అదే సమయంలో రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగితే మంచిది.
నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం వల్ల జీవక్రియలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మన అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతాయి. ఇప్పటికే ఈ అలవాట్లు ఉన్నవాళ్లు ఆ అలవాట్లను మార్చుకుంటే మంచిది.