మనలో చాలామంది గేదె పాలు, ఆవుపాలు తాగడానికి ఎంతో ఇష్టపడతారు. పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే పాలు పరిమితంగా తీసుకుంటే మాత్రమే హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. పాలు మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని చెప్పవచ్చు. పాలు సాధారణంగా తీసుకోవాల్సిన మొత్తం కంటే ఎక్కువ తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి.
పాలు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు కడుపు ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పాలు ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడే అవకాశాలు అయితే ఉంటాయి. పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై హానికారక దుష్ప్రభావాలు అయితే ఉంటాయనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.
పాలు అంటే అలెర్జీ ఉన్నవాళ్లు పాలను అస్సలు తీసుకోకూడదు. వీళ్లు పాలను తీసుకోవడం వల్ల నీరసం, అజీర్తి సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయని చెప్పవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఎక్కువ మొత్తంలో పాలను తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా పాలు తీసుకుంటారో వాళ్లను గుండె సంబంధిత సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంది.
పాలు తగినంత తీసుకుంటే మాత్రమే ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ మొత్తం తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి నష్టం అప్ప లాభం ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రోజులో మూడు కప్పుల పాలు తీసుకోవచ్చని అంతకంటే ఎక్కువ పాలు తీసుకుంటే మాత్రం నష్టమే తప్ప లాభం అయితే ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పాలకు బదులుగా పనీర్, పెరుగు, మజ్జిగ రూపంలో పాల ఉత్పత్తులను తీసుకుంటే మంచిది.