టీ ఎక్కువగా తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇలాంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగుతూ ఉంటారు. టీ, కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చాలామంది భావిస్తారు. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల ఎసిడిటీతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. టీ లేదా కాఫీ తాగితే నోటిలోని బ్యాక్టీరియా విచ్ఛిన్నం అవుతుంది. ఉదయం టీ తాగడం వల్ల వేర్వేరు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

ఎసిడిటీ, గుండెల్లో మంటతో పాట్ గ్యాస్ సమస్యలు సైతం టీ తాగేవాళ్లను వేధించే అవకాశం ఉంటుంది. పళ్లు తోముకోకుండా కాఫీ, టీ తాగితే చెడు బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్లి అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. టీ తాగడం వల్ల ఎనామిల్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. టీ, కాఫీ తాగడం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. టీ, కాఫీ తాగడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది.

కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్లు వ్యాయామానికి ముందు కాఫీ తీసుకుంటే మంచిది. ఈ విధంగా చేయడం వల్ల అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. ఉదయం టీ తాగాలని భావించే వాళ్లు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగితే హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. రోజుకు రెండు కప్పులు టీ, కాఫీ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. అమితంగా కాఫీ, టీ తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు.

ఉదయాన్నే టీ తాగడం వల్ల అల్సర్, ఊబకాయం సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. టీ ఎముకలపై దుష్ప్రభావం చూపడంతో పాటు చిరాకు, అలసటకు కారణమవుతుంది. టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు సైతం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. టీ తాగేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.