బీర్ ఎక్కువగా తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధులు మరీ ఇంత ప్రమాదకరమా?

170803-oktoberfest-beer-friends-ed-1040a

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో వేర్వేరు కారణాల వల్ల మద్యానికి బానిస అవుతుంటారు. ఎక్కువమొత్తంలో మద్యం తాగడానికి ఇష్టపడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే బీర్ ను పరిమితంగా తాగితే ఎన్ని లాభాలున్నాయో మోతాదును మించి తాగితే అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. బీర్ ను ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల శరీరంలోని కొన్ని హార్మోన్లు దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయి.

బీర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని పలు అవయవాలు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. బీర్ తాగడం వల్ల కాలేయంలోని వ్యర్థాలు బయటకు వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ఫ్యాటీ లివ‌ర్, ఊబ‌కాయం, బాణ పొట్ట వంటి అనారోగ్య సమస్యలకు బీర్ కారణమయ్యే అవకాశం ఉంటుంది. నిత్యం బీరు తాగితే మాత్రం డేంజర్ అని వైద్యులు చెబుతున్నారు. రాత్రి సమయంలో బీరు తాగడం వల్ల నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి.

రోజూ బీర్ తాగితే కిడ్నీ, లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బీపీ పెరగడానికి బీర్ కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. రోజూ బీర్ తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బీర్ లో 12 శాతం వరకు గరిష్టంగా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. వారంలో నాలుగు కంటే ఎక్కువ బీర్లు తాగితే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

బీరు తాగడం వల్ల శరీరం వేడి చేస్తుంది. ఎప్పుడో ఒకసారి బీర్ తీసుకుంటే నష్టం లేదు కానీ పదేపదే బీర్ తీసుకుంటే మాత్రం శరీరానికి హాని కలుగుతుందని చెప్పవచ్చు. లీటర్ల కొద్దీ బీరును తీసుకుంటే మాత్రం ప్రాణాలను పణంగా పెట్టినట్టేనని చెప్పవచ్చు.