హార్ట్ ఎటాక్ రాకుండా చేసే వంట నూనె ఇదే.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్లు రైన్ బ్రాన్ ఆయిల్ ను వాడితే మంచిదని సూచనలు చేస్తున్నారు. మన దేశంతో పాటు జపాన్, చైనాలో ఈ వంటనూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. తవుడు నుంచి తయారు చేసే ఈ నూనె వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ చేకూరుతాయి. ఈ వంటనూనె ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది.

ఈ వంటనూనెను వాడటం ద్వారా ఆరోగ్యంగా జీవనం సాగించడం సాధ్యమవుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, ఫ్రెండ్లీ ఫైటోకెమికల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ విసర్జనను పెంచే విషయంలో రైస్ బ్రాన్ ఆయిల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లకు ఈ వంట నునె ఎంతో మంచిదని చెప్పవచ్చు.

ఈ వంట నూనె శక్తివంతమైన ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటంతో పాటు క్యాన్సర్ నిరోధక ప్రభావాలను సైతం కలిగి ఉంటుంది. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఈ వంటనూనెలో ఉంటాయి. ఈ వంటనూనె నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ వంటనూనె చిగుళ్ల ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.

నోటి దుర్వాసన, వాపు, ఇతర ఆరోగ్య సమస్యలను రైస్ బ్రాన్ ఆయిల్ దూరం చేస్తుంది. ప్రముఖ కంపెనీలకు చెందిన రైస్ బ్రాన్ ఆయిల్ లను వాడటం వల్ల శరీరానికి ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. డాక్టర్లు సైతం ఇదే ఆయిల్ ను వాడాలని సూచిస్తున్నారు.