మహా శివరాత్రి రోజున ఉపవాసాలు ఎన్ని రకాలో తెలుసా.. ఈ విషయాలు మీకు తెలుసా?

శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అని పిలుస్తారు. మహా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఉపవాసం చేసే సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మహా శివరాత్రి రోజున కొన్ని తప్పులను అస్సలు చేయకూడదని గుర్తుంచుకోవాలి.

మహా శివరాత్రి రోజున కొంతమంది 24 గంటల పాటు ఉపవాసం చేస్తారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఈ ఉపవాసాన్ని నిర్జల ఉపవాసం అని కూడా పిలుస్తారు. జల ఉపవాసం చేసేవాళ్లు ఆకలిగా అనిపించిన సమయంలో నీళ్లు తాగడం ద్వారా ఉపవాసం చేస్తారు. మరి కొందరు మాత్రం శివరాత్రి పండుగ సమయంలో ద్రవ ఉపవాసం చేయడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు

ద్రవ ఉపవాసం చేసేవాళ్లు నిమ్మకాయ నీళ్లు తాగడంతో పాటు కొబ్బరి నీళ్లు, టీ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ద్రవ ఉపవాసం చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. పాలు, పండ్లు తీసుకుని ఉపవాసం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఆరోగ్యం బాగా లేని వాళ్లు సాత్విక ఆహారం తీసుకుని ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.

ఉడకబెట్టిన బంగాళదుంపలు, డ్రై ఫ్రూట్స్ , మఖానా, సగ్గు బియ్యం తీసుకోవడం ద్వారా ఉపవాసం చేయడంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఉప్పు, కారం లేకుండా సాత్విక ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఉపవాసం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల కు చెక్ పెట్టవచ్చు.