మగవాళ్లలో చాలామంది బీరు తాగడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. బీరు ఎక్కువ మొత్తం తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అయితే పరిమిత మొత్తంలో బీరు తాగితే మాత్రం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి భోజనంతో పాటు బీర్ తాగడం ద్వారా మంచి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. బీర్ ను పరిమితంగా తీసుకోవడం ద్వారా అల్జీమర్స్ నుంచి కూడా రక్షణ పొందవచ్చు.
బీర్ తాగడం గుండె, రక్తం, జీవక్రియలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా అంతకంతకూ తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.రోజూ బీర్ తాగడం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ అనేది పెరగదు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరచడంలో బీరు ఉపయోగపడుతుంది. ప్రేగుల్లో బ్యాక్టీరియాకు సంబంధించి బీర్ వల్ల ప్రయోజనం చేకూరనుండటంతో పరిమితంగా బీరు తీసుకుంటే మంచిది.
అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం వైద్యుల సలహాలు, సూచనల ప్రకారం బీరు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇప్పటివరకు మద్యం అలవాటు లేని వాళ్లు మాత్రం మద్యంకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. బీరు తాగేవాళ్లు ఎక్కువ మొత్తం తాగితే మాత్రం అవయవాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. బీరు విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
పలు అధ్యయనాలు సైతం బీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నాయి. మితంగా బీరు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.