మధుమేహంతో బాధపడేవారు రోజువారి డైట్ లో పాటించాల్సిన నియమాలు…

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మధుమేహం వ్యాధితో పోరాటం చేయాల్సి వస్తోంది. కారణాలు ఏవైనా మధుమేహం వ్యాధి బారిన ఒకసారి పడితే జీవితకాలం పాటు నియంత్రణలో ఉంచుకోవాల్సిందే లేకపోతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే మన రోజువారి ఆహారపు అలవాట్లలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అయితే చాలామందికి రోజువారి డైట్ లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు వంటి విషయాల్లో చాలా సందేహాలు ఉంటాయి .

మొదట మధుమేహం వ్యాధితో బాధపడేవారు రోజువారి డైట్ లో తీసుకోకూడని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొలెస్ట్రాల్ అధికంగా ఉండే పిజ్జా, బర్గర్,ఫ్రైడ్ రైస్, ప్రెంచ్ ఫ్రైస్, డోనట్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ ను అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి ఉబకాయ సమస్య ఏర్పడుతుంది. దాంతో మధుమేహ సమస్యకు దారితీసి జీవితకాలం పాటు వ్యాధితో పోరాటం చేయాల్సి వస్తుంది.అలాగే మధుమేహం వ్యాధిగ్రస్తులు అత్యధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న , వైట్ రైస్, బంగాళాదుంప, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష వంటివి ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరిగి మధుమేహం వ్యాధి నియంత్రణ కోల్పోతుంది.

మధుమేహం వ్యాధి నుంచి భవిష్యత్తులో రక్షణ పొందాలంటే రోజువారి ఆహారంలో అత్యధిక కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు కలిగిన వైట్ రైస్ ను ఆహారంగా తీసుకోవడానికి బదులు పీచు పదార్థం సమృద్ధిగా ఉండే జొన్నలు,రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మరియు గ్లూకోజ్ తక్కువగా ఉంది అత్యధిక పీచు పదార్థం ఉన్న ఆపిల్, నారింజ, బెర్రీ , డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న పీచు పదార్థం రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించి మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచుతుంది.