కీళ్ల నొప్పులను సులువుగా తగ్గించే అద్భుతమైన చిట్కాలివే.. ఎలా అంటే?

jointpain-6

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని కీళ్ల సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. కీళ్ల సంబంధిత సమస్యల వల్ల కొంతమంద్ మోకాళ్ల ఆపరేషన్ పై ఆధారపడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కీళ్ల నొప్పులకు సులువుగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినా కీళ్ల నొప్పులు వేధించే అవకాశాలు ఉంటాయి.

యూరిక్ ఆసిడ్ మోకాళ్ల చుట్టూ స్పటికాలుగా ఏర్పడి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆహారంలో అల్లం, పసుపు, మెంతులు చేర్చుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గోరువెచ్చని నువ్వుల నూనెతో కాళ్లను మసాజ్ చేయడం ద్వారా కూడా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. వేడిగా ఉన్న ఆహారం తినడం ద్వారా కూడా కీళ్లనొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది.

తేలికపాటి వ్యాయామం ద్వారా కూడా కీళ్ల నొప్పులకు సులువుగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువగా శ్రమ చేసేవాళ్లకు సైతం కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకేసారి ఎక్కువ మెట్లు ఎక్కకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆపరేషన్ లేకుండా సహజ పద్దతుల్లో కీళ్లనొప్పులను తగ్గించుకుంటే మంచిది.

కీళ్ల నొప్పులకు సంబంధించి ప్రతిరోజూ ట్యాబ్లెట్లు వాడటం కూడా మంచిది కాదు. కీళ్ల నొప్పులు మొదట చిన్న సమస్య అని అనిపించినా నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్య అయ్యే అవకాశాలు ఉంటాయి. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.