యువతకు గుండెపోటు రావడానికి అసలు కారణమిదే.. దీనిని మానేస్తే బెటర్!

ఈ మధ్య కాలంలో ఎంతో ఆరోగ్యంగా ఉన్న యువతీయువకులు గుండెపోటు బారిన పడుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. గుండెల్లో బ్లాక్స్ వల్ల ఎక్కువమంది గుండెపోటు బారిన పడుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం గుండెపోటుకు కారణమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం ఉప్పు అని చెప్పవచ్చు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా గుండె కణజాలంలో ఉప్పు శాతం పెరిగితే రక్త సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఊరగాయలను తినడం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఉప్పు ఎక్కువగా తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. మరీ ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల శరీరానికి లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇప్పటికే గుండె సంబంధిత సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఉప్పుకు దూరంగా ఉంటే మంచిది. యువత హఠాత్తుగా కుప్పకూలడానికి ఉప్పే కారణమని మంతెన సత్యనారాయణరాజు చెప్పుకొచ్చారు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉండేవాటిని తీసుకుంటే మంచిదని తెలుస్తోంది. ఉప్పు తక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రమే శరీరానికి మేలు జరుగుతుంది.

ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడిన వాళ్లకు ఉప్పు ఏ మాత్రం మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉప్పు విషయంలో ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.