గర్భిణీ స్త్రీలు అస్సలు చేయకూడని తప్పులివే.. ఈ తప్పులు చేస్తే మాత్రం రిస్క్ లో పడినట్లే!

గర్భిణీ స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు, ఎందుకంటే అవి బిడ్డకు మరియు తల్లికి హానికరంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో చేయకూడని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి. గర్భధారణ సమయంలో ధూమపానం మరియు మద్యం సేవించడం పిండానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఇది శిశువు ఎదుగుదల, బరువు మరియు నాడుల సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, మీరు గర్భవతి అని తెలిసిన వెంటనే ఈ అలవాట్లను మానేయడం చాలా ముఖ్యం.

ప్రాసెస్ చేసిన మరియు చక్కెర పదార్థాలు వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తినవద్దు. కఠిన వ్యాయామాలు చేయడం వల్ల గర్భం కోల్పోయే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో డాక్టర్ సలహా లేకుండా కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. ఒత్తిడి మరియు ఆందోళన బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

గర్భిణీ స్త్రీలు తరచుగా వాంతులు చేసుకోవడం వల్ల ఆమ్లాల పెరుగుదల చిగుళ్ల సమస్యలకు దారితీస్తుంది. దంతాల ఆరోగ్యం కోసం డెంటిస్ట్ ను సంప్రదిస్తే మంచిది. గర్భధారణ సమయంలో రేడియేషన్ ప్రమాదం పిండం ఎదుగుదలకు హాని కలిగిస్తుంది. కాబట్టి, గర్భవతిగా ఉన్నప్పుడు రేడియేషన్ ప్రమాదం నుండి దూరంగా ఉండాలి. గర్భం ధరించడం అన్నది ప్రతి మహిళ జీవితంలో ఓ అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. గర్భధారణ అతి సున్నితమైన, అతి సంక్లిష్టమైన ప్రక్రియ. చిన్న పొరపాటు జరిగినా తల్లి, బిడ్డ ప్రాణాలు రిస్క్ లో పడతాయి.

గర్భిణీగా ఉన్నప్పుడు కొంతమంది తెలియక చేసే తప్పులు వారిని ప్రమాదంలోకి తీసుకెళుతాయి. అందుకే ఆ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు పచ్చి లేదా సగం వండిన ఆహారాలను పూర్తిగా నివారించండి. సగం ఉడికిన అన్నం, పచ్చి కూరగాయలు, అధిక మసాలా తిండి, ప్రాసెస్డ్ ఫుడ్‌ తినకూడదు. జీడిపప్పు, అల్లం టీ ఆకులు వంటి వాటిని తీసుకోకూడదు. గర్భం దాల్చిన తర్వాత చాలా మందికి బెడ్​రెస్ట్​ మంచింది. అలా విశ్రాంతి తీసుకోవడం వల్ల పిండానికి ఎక్కువ రక్త సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. స్నానానికి, బాత్రూమ్​కు తప్ప లేవకుండా ఉండాలి.