మనలో చాలామంది వంటల్లో ఎక్కువగా గసగసాలను వినియోగిస్తారు. గసగసాలు వాడటం వల్ల వంటలు రుచిగా ఉంటాయి. అయితే గసగసాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు గసగసాలు చెక్ పెడతాయి. ఎసిడిటీ, కడుపుమంట సమస్యలకు చెక్ పెట్టడంలో గసగసాలు ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు.
గసగసాలు వాడటం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవుతుంది. గసగసాలలో ఉండే ఆక్సలేట్లు కాల్షియంను గ్రహించడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. గసగసాలలో శరీరానికి అవసరమైన పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకం సమస్య వేధించే అవకాశాలు తగ్గుతాయి. గసగసాలను పరిమితంగా తీసుకుంటే ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
మోతాదుకు మించి గసగసాలను వాడితే మాత్రం స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి లైంగిక సామర్థ్యం దెబ్బ తినే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కడుపుమంట సమస్య ఉన్నవాళ్లు వీటిని వాడితే కడుపులో పుండ్లు తగ్గుతాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లు గసగసాలను తీసుకుంటే మాత్రం గసగసాలు చలువ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. గసగసాలను తీసుకోవడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
నిద్ర సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు సైతం గసగసాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో మందుల తయారీలో గసగసాలను వినియోగిస్తారు. కూరలలో గసగసాలు వేయడం వల్ల రుచి మారిపోవడంతో పాటు కూరలు ఎంతో టేస్టీగా ఉంటాయి. గసగసాలు వాడిన వంటలకు ప్రత్యక రుచి, కమ్మదనం వస్తుంది. కూరలలో వీటిని కచ్చితంగా వినియోగిస్తే ఆరోగ్యానికి మంచిది.