Home Health & Fitness ఆవకాయ, ఊరగాయ పచ్చళ్లు ఆరోగ్యానికి ఎంత మంచివి..?

ఆవకాయ, ఊరగాయ పచ్చళ్లు ఆరోగ్యానికి ఎంత మంచివి..?

భోజనంలోకి కూర, పప్పు, సాంబారు, పెరుగు ఎంత ముఖ్యమో పచ్చడి అంతే ముఖ్యం. భోజనప్రియులు పచ్చడితోనే అన్నం తినడం మొదలుపెడతారు. పైగా.. వేసవి వచ్చేసిందాయె..! ఆవకాయ లేని ఇల్లు ఉండదు. కొత్త ఆవకాయ కోసం ఆవురావుమని ఎదురు చూస్తాం. వేసవిలో వేడి వేడి అన్నంలో ఆవకాయ, నెయ్యి కలుపుకుని తింటే ఆ మజానే వేరు. ఊరగాయ పచ్చడి కూడా అంతే. ఇక రోటి పచ్చళ్లు ఏడాది పొడవునా చేస్తూంటారు ఇళ్లల్లో. ఇలా పచ్చడి లేకుండా దాదాపు మన భోజనం మొదలవదు.. పూర్తి కాదు. అయితే.. పచ్చడి తినడం కరెక్టేనా.. వేసవిలో తినొచ్చా.. కారం మోతాదు, వేడి.. ఇలా చాలా అనుమానాలు ఉండటం సహజం. వీటికి నిపుణులు చెప్పే సలహా ఇంట్లో చేసే పచ్చళ్లు ఆరోగ్యమే అంటున్నారు.

Sddefault | Telugu Rajyam

ఊరగాయ పచ్చళ్లను ఉప్పు లో ఊరబెట్టి కలుపుతారు కాబట్టి.. ఆ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. పచ్చళ్లలో మెంతులు జీలకర్ర ధనియాలు.. వగైరా యాడ్ చేస్తారు. వాటిలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇంట్లో చేసే పచ్చళ్లలో మాత్రమే ఉంటాయని.. ఇవి ఎంతో ఆరోగ్యమే కాకుండా ఒబేసిటీని తరిమికొట్టి.. డయాబెటిస్, కొవ్వును తగ్గిస్తాయంటున్నారు. శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా కొవ్వుని కరిగించే తత్వం కలిగి ఉంటాయని అంటున్నారు. ఊరగాయలో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది. బ్లోటింగ్ తొలగిస్తుందని న్యూట్రిషనిస్టులు అంటూంటారు.

వేసవిలో మాత్రమే పట్టే ఆవకాయ, మాగాయ పచ్చళ్లు ఏడాది పొడవునా పాడవకుండా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి కూడా టేస్ట్ మారతాయి. కానీ.. ఎక్కడ తిన్నా ఫీల్ ఆవకాయ ఒకలానే ఉంటుంది. ఆవకాయ కాకుండా ప్రాంతాలవారీగా పచ్చళ్లు మారుతూ ఉంటాయి. ఇంట్లోనే పచ్చళ్లు చేస్తారు కాబట్టి ఇవి ఎలా చేసినా  ఆరోగ్యానికి మంచిదే. ఒంట్లో విటమిన్స్ తక్కువగా ఉంటే పచ్చళ్ళు తినడం వల్ల B12, విటమిన్ D3 ప్రొడక్షన్ కూడా జరుగుతుందని న్యూట్రిస్టులు అంటున్నారు. పచ్చళ్ల వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా తీరతాయని అంటున్నారు. పచ్చళ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు న్యూట్రిస్టులు. పచ్చళ్లు వేడి అనే మాట ఉన్నా సీజనల్ గా వచ్చే పచ్చళ్లను తినడమే బెటర్. అందులోనూ ఆవకాయ మన తెలుగు వారికి ఎమోషన్ కదా..!

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆయా సందర్భాల్లో ఆరోగ్య నిపుణులు తెలిపినవి, పలు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం అర్హత ఉన్న వైద్యులు, ఆహార నిపుణలకు ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమైన మార్గం.

 

Related Posts

‘మైగ్రేన్’ విముక్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

మైగ్రేన్... తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పి. సాధారణంగా వచ్చే తల నొప్పికి ఒక కప్పు టీ లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తరుచుగా...

ఆరోగ్యానికి అమృతం… ‘డ్రాగ‌న్ ఫ్రూట్’ ! ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా ప్రజలలో ఈ మధ్య ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద అవగాహన పెరిగి ఫ్రూట్స్ వాడకం చాలా ఎక్కువైంది. ఈ క్రమంలోనే 'డ్రాగ‌న్ ఫ్రూట్' ప్రాధాన్యత వాణిజ్యపరంగా బాగా పెరిగింది....

లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఉదయాన్నే వీటిని ట్రై చేయండి !

ఒక మంచి వేకువ జాము దినచర్య అనేది ఎంతో మంది విజయ రహస్యంగా భావించవచ్చు. కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన లక్ష్యాలను చేధించే ప్రక్రియకు శక్తినిస్తాయి. జీవితంలో ఏదో సాధించాలని అనుకునే...

Related Posts

Latest News