గుండెపోటు సమస్య ఉన్నవారు చలికాలంలో వీటి జోలికి అస్సలు వెళ్ళకండి..?

doc6wgbo29zhpfrv1iak1e

గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ చలికాలంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే తీవ్రమైన గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగానే చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా రక్త ప్రసరణ తగ్గి గుండె పనితీరు మందగిస్తుంది. దానికి తోడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు మరింత తీవ్ర గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడడాలంటే ఈ చలికాలంలో కొన్ని ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకూడదని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే చలి తీవ్రతను తగ్గించుకోవడానికి స్పైసీగా ఉండే ఫాస్ట్ ఫుడ్, వేడిగా ఉండే ఫ్రైడ్ రైస్, బాగా నూనెలో డ్రై గా వేయించి స్నాక్స్ ఎక్కువగా తింటుంటారు. అప్పటికి ఆనందంగా ఉంటుందేమో కానీ తర్వాత కొన్ని గంటలకు కడుపులో అలజడి మొదలై కడుపు మంట, ఉబ్బసం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తి గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. అదే గుండె జబ్బు సమస్య ఉన్న వారైతే మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి గుండె జబ్బు ఉన్నవారు ఈ చలికాలంలో ఫాస్ట్ ఫుడ్, అత్యధిక కొలెస్ట్రాల్ కలిగిన ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి.

చలి తీవ్రత నుంచి తట్టుకోవడానికి చాలామంది కాఫీ, టీ ఎక్కువగా తాగుతుంటారు. అలాగే సిగరెట్స్ కూడా ఎక్కువగా కాలుస్తుంటారు. దీనివల్ల మనలో కెఫిన్ ఆల్కలిన్ మోతాదు పెరిగి గుండె కండరాలపై తీవ్ర ఒత్తిడిని కలగజేస్తుంది. గుండెపోటు ముప్పు ఉన్నవారు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ వంటి తీపి పదార్థాలను తినడం దాదాపుగా తగ్గించాలి. చలికాలంలో చాలా మంది రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటారు.రెడ్ మీట్‌లో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి. దీనికి బదులుగా గుండె ఆరోగ్యాన్ని పెంచే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు నిండుగా ఉన్న చేపలను ఆహారంగా తీసుకోవడం మంచిది.