చూడగానే నోరూరించే అనాస పండ్లు అద్భుతమైన రుచిని కలిగి ఉండడంతో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సమృద్ధిగా కలిగి ఉన్నాయి. అనాస పండ్లను పైనాపిల్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా పైనాపిల్ లో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, పొటాషియం, సోడియం ,ఐరన్ జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అనాసపండ్లలో సమృద్ధిగా లభించే విటమిన్ సి, సహజ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. అలాగే అనేక ఇన్ఫెక్షన్లను ఎదుర్కొని ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా తోడ్పడుతుంది.
అనాస పండ్లలో సమృద్ధిగా లభించే పొటాషియం మాంగనీస్ సోడియం వంటి ఖనిజ లవనాలు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలు ఎముకల దృఢత్వానికి తోడ్పడి కీళ్ల నొప్పులు, కండరాల వాపు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకున్నవారు ప్రతిరోజు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ సేవిస్తే అద్భుత ఫలితం ఉంటుంది. శరీర బరువును నియంత్రించడంతోపాటు ఇందులో ఉండే అమైనో ఆసిడ్స్ పొట్ట ,నడుము, రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడంలో సహాయపడతాయి.
పైనాపిల్ రసంలో తేనె కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో సమర్థవంతంగా పోరాడి పచ్చకామెర్లు, ఫ్యాటీ లివర్, క్యాన్సర్, గుండె జబ్బు, డయాబెటిస్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.అనాస పండు ముక్కలను తేనెలో ఒక రోజంతా ఉంచి మరుసటి రోజు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోయి పేగులు పొట్టలో ఉన్న చెడు మలినాలు బయటికి పంపడంలో సహాయపడుతుంది. పైనాపిల్ గుజ్జును అప్పుడప్పుడు చర్మంపై మర్దన చేసుకుంటే ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు మలినాలను తొలగించి చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతుంది.