క్రమ పద్ధతి లేని జీవన విధానం ఆహారపు అలవాట్ల కారణంగా దాదాపు 60 శాతం జనాభా ఉబకాయం, గుండె జబ్బులు, రక్తపోటు, ఫ్యాటీ లివర్, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు కారణం మన ఒంట్లో చెడు రసాయనాలు, వ్యర్ధాలు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. వీటన్నిటికీ కారణం శరీరంలో చెడు వ్యర్ధాలను తొలగించే కాలేయం పనితీరు మందగించడమే. శరీరంలో ఉండే విష పదార్థాలను, రసాయనాలను బయటకు పంపించి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో కాలేయం ఎంతగానో ఉపయోగపడుతుంది. లివర్ ఆరోగ్యాన్ని పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లివర్ ఆరోగ్యాన్ని రక్షించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనేక పరిశోధనల్లో కూడా ఈ నిజం స్పష్టమైంది. వెల్లుల్లిలో ఉండే అలిసిన్, డైఅలి, డై సల్ఫైడ్ అనే రసాయన సమ్మేళనాలు లివర్ వ్యాధులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయ కణాలు దెబ్బతినకుండా చేయడంలో వెల్లుల్లిలోని రసాయనాలు అద్భుతంగా పనిచేస్తాయి.వెల్లులిలో సిలినీయం అనే రసాయనం ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రూపాంతరం చెంది చెడు వ్యర్ధాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
అయితే చాలామంది వెల్లుల్లి రోజువారి ఆహారంలో ఉపయోగిస్తున్నామని చెబుతుంటారు. అలా చేయడంవల్ల వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు పోషక విలువలు నశించిపోయి తక్కువ ప్రయోజనాలను మాత్రమే పొందగలము. వెల్లుల్లిలోని అద్భుత ప్రయోజనాలను పొందాలంటే వెల్లుల్లిని చిన్నగా తరిగి తేనెతో కలిపి తీసుకోవచ్చు లేదా మీగడతో కలిపి చిన్న మంటపై దోరగా వేయించి తింటే వెల్లుల్లిలోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను సంపూర్ణంగా పొందవచ్చు.