పెయిన్ కిల్లర్ మందులను అతిగా వినియోగిస్తున్నారా … ఈ వ్యాధుల జాబితాలో మీరు ఉన్నట్లే?

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పోషకాహార లోపం వల్ల శరీరానికి తగిన శక్తి లభించక అవయవాల పనితీరులోను, పెరుగుదలలో వ్యత్యాసం ఏర్పడుతుంది. దీంతో ప్రతిరోజు మనం అనేక సమస్యలతో బాధపడాల్సి వస్తోంది ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి ఇలా అనేక రకాల నొప్పులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

ప్రతిరోజు నొప్పి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎడాపెడ పెయిన్ కిల్లర్స్ ను వినియోగిస్తున్నారు. ఇలా
దీర్ఘకాలం పాటు విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ వినియోగించడం అత్యంత ప్రమాదకరమని దీనివల్ల
భవిష్యత్తులో కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే గుండె జబ్బులు, చిన్న పెద్దప్రేగు క్యాన్సర్లు, చర్మ వ్యాధులు, మెదడు పనితీరు మందగించడం, గ్యాస్టిక్, ఉబ్బసం, సంతానలేని, వీర్యకణాలు మందగించడం వంటి అనేక తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పెయిన్ కిల్లర్ మందులను అత్యవసర సమయాలైన ఆపరేషన్ సమయాల్లోనూ, నొప్పి తీవ్రత మరి ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. అలాకాకుండా నొప్పి నివారణ మందులను ఇష్టం వచ్చినట్లు వినియోగించడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు కొన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది.

ప్రతిరోజు నొప్పి నివారణ మందులు వినియోగించడం బదులు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. మన శరీర పెరుగుదలకు అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ జింకు వంటి మూలకాలు పుష్కలంగా ఉన్న పళ్ళు కూరగాయలను నిత్యం మన ఆహారంలో చేర్చుకోవాలి. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్స్,మినరల్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనలో వ్యాధి కారకాలు తొలగి ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చు.