సరియైన నిద్ర పోవడం లేదా.. అయితే ఏం జరుగుతుందో చూడండి?

మనం రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అంటారు. అలాగే ప్రతిరోజు ఆరు గంటలకు పైగా నిద్రపోతే కూడా డాక్టర్ అవసరం ఉండదు. మనిషి తన జీవితకాలంలో రెండు వంతులు జీవనానికి ఒక వంతు నిద్రకు కేటాయిస్తాడు. అప్పుడే ఏ అనారోగ్యం ఉండదు. అయితే నిద్ర సరిపోకపోతే వచ్చే అనర్థాలేంటో చూద్దాం.

మనిషి నిద్రపోయినప్పుడు బ్రెయిన్ అనేది ఆలోచించకుండా విశ్రాంతి తీసుకుంటుంది. ఇంకా ముఖ్యంగా బ్రెయిన్ లో టాక్సిన్లు వెలువడినవి అన్ని బయటకు వెళ్లిపోతాయి. దీని ద్వారా బ్రెయిన్ కు రిలీఫ్ గా ఉంటుంది. విశ్రాంతి లేనప్పుడు ఈ టాక్సిన్ల ప్రభావం బ్రెయిన్ పై పడి అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనిషి తన జ్ఞాపక శక్తిని మర్చిపోతాడు ఇంకా ఇది ఆల్జీమర్స్ కు కూడా దారితీస్తుంది.

ఇక ముఖ్యంగా మనిషి పుట్టినప్పటినుంచి జీవిత కాలమంతా గుండె పని చేస్తూనే ఉంటుంది. గుండె అనేది మనిషి నిద్ర పోయినప్పుడు కాస్త నెమ్మదిగా పనిచేస్తుంది. ఆ సమయంలో గ్రోత్ హార్మోన్లు విడుదలవుతాయి ఇవి కండరాలు పటిష్టంగా ఉండటానికి తోడ్పడతాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు విడుదలయ్యి నలుపుగా మారడం కళ్ళ కింద నల్లటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది.

ముఖ్యంగా ఆహారం కాస్త తక్కువైనా పర్వాలేదు కానీ నిద్ర తక్కువ చాలా అనర్ధాలు వస్తాయి. ముఖ్యంగా జిమ్ చేసేవారు మంచి ఆహారం, ఎక్సర్సైజులు చేస్తారు కానీ నిద్ర తక్కువ తీసుకోవడం వల్ల ఫలితం అంతగా కనపడదు. తాజాగా ఒక విశ్లేషణలో 6 గంటలకు పైగా నిద్రించే వారిలో రక్తప్రసరణ బాగా జరిగి అందంగా కనపడడమే కాక వయసు కూడా 10 సంవత్సరాలు తక్కువ కనపడుతుందని సమాచారం.

ఇక షిఫ్ట్ వైస్ జాబ్ చేసేవారు నైట్ షిఫ్ట్ గనక చేయవలసి వస్తే సాయంత్రమే రెండు లేదా మూడు గంటలు నిద్రపోతే మంచిది లేదంటే మెదడుకు ఏ టైం లో నిద్రపోవాలో తెలియక బాడీలో స్ట్రెస్ ఇంకా చిరాకు పెరుగుతుంది. గుండెపోటు, రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. కావున రోజుకు ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి.