మీ పిల్లలు పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా.. ఈ తప్పులు చేస్తే ఇంత ప్రమాదమా?

పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ముక్కులో వేలు పెట్టుకునే అలవాటును కలిగి ఉంటారు. ఈ అలవాటు వల్ల నష్టం లేదని చాలామంది భావించినా ఈ అలవాటు వల్ల ఊహించని స్థాయిలో నష్టం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిన్న తప్పుల వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

ముక్కులో ఉండే వెంట్రుకలు గాలిని ఫిల్టర్ చేయడంతో పాటు  ధూళి, బాక్టీరియా శరీరంలోకి వెళ్లకుండా చేయడంలో సహాయపడతాయి. ముక్కులో వేలు పెట్టి త్రిప్పడం వల్ల ముక్కు వెంట్రుకల దగ్గర ఆగిపోయిన బాక్టీరియా శరీరం లోపలికి వెళ్లి అల్జీమర్స్ తో పాటు మనం వాసన చూసే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని సమాచారం అందుతోంది. ఈ అలవాటు వల్ల న్యూమోనియా తరహా జబ్బులు కూడా వస్తాయి.

పిల్లలు ఉన్న తల్లీదండ్రులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఈ అలవాటును ఇప్పటికే కలిగి ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా ఈ అలవాటును దూరం చేసుకోవడంతో పాటు తక్షణమే ఆ అలవాటును వదిలేస్తే మంచిది. ఈ అలవాటును మానని పక్షంలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.

చిన్నపిల్లలు తెలీక చేసే చిన్నచిన్న తప్పుల వల్ల కొన్నిసార్లు వాళ్ల జీవితం ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పిల్లల విషయంలో తగినంత కేర్ తీసుకోవడం ద్వారా పిల్లలు ఈ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తల్లీదండ్రులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.