మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఈ జ్యూస్ తాగాల్సిందే.. ముఖ్యంగా మహిళలు?

ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతు వృత్తిరీత్యా అధిక ఒత్తిడికి గురై మానసిక,శారీరక అనారోగ్యాలతో నిత్యం కుస్తీ పడుతున్నారు. దానికి తోడు ప్రతిరోజు మనం ఆహారంగా తీసుకునే ఫాస్ట్ ఫుడ్ లో అత్యధిక కొవ్వు పదార్థాలు ఉండడంతో బిపి, షుగర్ ,గుండె జబ్బులు, అల్జీమర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు మనల్ని బాధిస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి
ప్రతిరోజు ఉదయాన్నే బీట్రూట్, బాదం జ్యూస్ సేవిస్తే మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సహజ పద్ధతిలో లభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

బీట్రూట్ ,బాదం జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట తాజా బీట్రూట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. తరువాత గుప్పెడు నానబెట్టిన బాదం పప్పును తీసుకొని బీట్రూట్ ముక్కలు వేసిన జార్లో వేసుకోవాలి. బాదం పప్పును ఒకరోజు ముందే నానబెట్టుకోవడం మంచిది. రుచికోసం పచ్చి కొబ్బరిని వేసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి మిక్సీలో మెత్తని మిశ్రమంగా తయారు చేసుకొన్న తర్వాత మిశ్రమాన్ని వడగట్టుకుంటే మంచి రుచికరమైన ఆరోగ్యవంతమైన బీట్రూట్ బాదం జ్యూస్ రెడీ అయినట్లే. ఈ జ్యూస్ లోకి తేనె సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు.

వారంలో మూడు లేదా నాలుగు రోజులు బాదం బీట్రూట్ జ్యూస్ ను సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మన శరీరంలోని చెడు మలినాలను తొలగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఈ జ్యూస్ ను సేవిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి సమృద్ధిగా జరిగి రక్తహీనత సమస్య దూరం అవడంతో పాటు అలసట నీరసం మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తొలగి రోజంతా చురుగ్గా ఉంచుతుంది. బీట్రూట్ బాదంపప్పులో పుష్కలంగా ఉన్న యాంటీ క్యాన్సర్ లక్షణాలు శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలతో సమృద్ధిగా పోరాడి అనేక క్యాన్సర్లను నియంత్రిస్తాయి. ఈ జ్యూస్ లో పుష్కలంగా లభించే విటమిన్స్ కంటి ఆరోగ్యా న్ని చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. తరచూ ఈ జ్యూస్ సేవించడం ద్వారా మన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,జింక్, పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.