ఈ ఆహారాలు తింటే కంటిచూపు సమస్యలు ఎప్పటికీ రావట.. అదిరిపోయే చిట్కాలివే!

సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు చెబుతారు. కళ్లు ఆరోగ్యంగా ఉంటే ఎంత పెద్ద ఆరోగ్య సమస్యలు అయినా సులువుగా అధిగమించవచ్చు. ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని కంటి సమస్యలు వేధిస్తున్నాయి. చిన్న వయసులోనే కంటి మసక సమస్యలు వచ్చి కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లను ఎక్కువ సమయం చూడటం వల్ల కూడా కొంతమంది కంటి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని సమాచారం అందుతోంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పౌష్టిక ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. పలను ఎక్కువగా తినడం వల్ల దృష్టి సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

బ్రోకలీ లో ఉండే లూటిన్ మరియు జియాక్సంతిన్ వంటి మూలకాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ద్రాక్ష పండ్లను ప్రతిరోజు తినడం వల్ల కూడా కళ్ళ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఏ లభించే అవకాశం ఉంటుందని సమాచారం అందుతోంది. కంటి చూపును పెంచడంలో జామ పండు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సమాచారం అందుతోంది.

గుడ్డులో కళ్ళకు అవసరమైన జింక్ మరియు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయని సమాచారం అందుతోంది. పచ్చి కూరగాయలు,ఆకు కూరలు ఎక్కువగా తినటం వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. సహజమైన రీతిలో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు పాటించడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు.