నోరూరిస్తున్న పచ్చిమామిడి… పచ్చిమామిడి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

వేసవికాలం వచ్చిందంటే మామిడికాయలు మనకు మార్కెట్లో లభ్యమవుతాయి ముఖ్యంగా పచ్చి మామిడికాయలు తినడానికి పుల్లపుల్లగా ఉండడంతో కాస్త ఉప్పు కారం చల్లి తింటే ఆరుచే వేరుగా ఉంటుంది. ఇలా మామిడి పండ్లు ఏడాదికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే మనకు సీజన్ మొదట్లో దొరికే పచ్చి మామిడి పండ్లను తినడానికి చాలామంది ఇష్టపడతారు అయితే పచ్చి మామిడిపండ్లు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అద్భుతమైన పుల్లని, వగరు రుచులతో ఉన్న పచ్చి మామిడి తో చేసే చట్నీ, పప్పు, కర్రీస్, ముఖ్యంగా పచ్చళ్ళు రుచిని వర్ణించడం అసాధ్యమని చెప్పొచ్చు.పచ్చి మామిడి అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఔషధ గుణాలు పచ్చి మామిడికాయల్లో సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా లభ్యమవుతాయి కావున మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

పచ్చి మామిడిలో ఉండే విటమిన్ ఏ, కేరోటినాయిడ్స్ కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఈ సీజన్ లో పచ్చి మామిడి కాయలను తింటే విటమిన్స్ లోపం తొలగిపోయి స్కర్వి, చర్మం పొడి వారడం, జుట్టు సమస్యలు, చిగుళ్లలో రక్తం కారడం వంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.
పచ్చి మామిడిలో సమృద్ధిగా ఫైబర్ లభిస్తుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తొలగిస్తుంది. ఇక ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి కదా అని పచ్చి మామిడిని తరచుగా తినడం వల్ల అజీర్తి కడుపులో మంట వంటి సమస్యలు కూడా రావడానికి కారణం అవుతుంది.