నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టాలనుకుంటున్నారా.. పాటించాల్సిన చిట్కాలివే!

bad-breathe-cover-1630757115

మనలో చాలామందిని వేర్వేరు సందర్భాల్లో వేధించే సమస్యలలో నోటి దుర్వాసన సమస్య కూడా ఒకటి. ఈ సమస్య వినడానికి చిన్న సమస్యగా వినిపించినా ఎంతోమంది ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. నోటి దుర్వాసన వల్ల కొన్ని సందర్భాల్లో ఇతరులు సైతం ఇబ్బందులు పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నోటి దుర్వాసన కోసం ఒక్కొక్కరు ఒక్కో తరహా చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే అందరికీ అన్ని చిట్కాలు పని చేయవని చెప్పవచ్చు. చిగుళ్లకు సంబంధించిన సమస్యల వల్ల లేదా తీసుకునే ఆహారం వల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశం అయితేఉంటుందని చెప్పవచ్చు. ఉప్పు నీళ్లతో నోటిని రోజుకు రెండు నుంచి మూడుసార్లు శుభ్రం చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.

నోటి దుర్వాసనకు చెక్ పెట్టడంలో లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. లవంగంతో చేసిన టీ తాగడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి తాగడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పటికను నీళ్లలో ఉంచి ఫిల్టర్ చేసిన దానిని స్టోర్ చేసి పళ్లు శుభ్రం చేసుకున్న తర్వాత పుక్కిలించుకుంటే మంచిది.

ఈ చిట్కాలు వాడినా ఫలితం లేని పక్షంలో వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని నోటిని శుభ్రం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. నోటి సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. నోటి దుర్వాసన చిన్న సమస్యగా అనిపించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ సమస్య పెద్ద సమస్య అయ్యే ఛాన్స్ ఉంది.