కూరలో వాడే పుదీనాలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా!

అద్భుతమైన సువాసన ఇచ్చే మొక్కల్లో పుదీనా ఒకటి. ఇందులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పుదీనాను ఆయుర్వేద మూలికలలో వాడతారు. ప్రస్తుతం పుదీనాతో టూత్ పేస్టులు కూడా వస్తున్నాయి. పుదీనాలో విటమిన్ A, C తో పాటు బి కాంప్లెక్స్ కూడా అధికంగా ఉంటుంది. పుదీనా ఆకుల రసాన్ని ఔషధ కంపెనీలు, కాస్మోటిక్ కంపెనీలు క్రిముల, ఔషధాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు.

పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూటియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఎంజైములు ఆహారాన్ని సులువుగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. గ్యాస్ వల్ల కలిగే ఎసిడిటీని పుదీనా తగ్గిస్తుంది. ప్రతిరోజు పుదినాను తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పుదినాలోని మెంథాల్ ఊపిరితిత్తులను వదులు చేయడంలో, శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది.

పుదీనా తినడం వల్ల ఉబ్బసం సమస్యలు నివారించవచ్చు. పుదీనాలోని మెంథాల్ శరీరంలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఇంకా కండరాలలోని నొప్పి తగ్గిస్తుంది. పుదీనా ఆకు రసం నుదుటిపై రాసినట్లయితే తలనొప్పి తక్షణమే తగ్గిపోతుంది. పుదీనాలో సలిసిలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని లోపలి వైపు నుండి శుభ్రం చేసి మలినాలను తీసివేస్తుంది.

పుదీనా వల్ల చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా మారుతుంది. పుదీనా ఆకులను నమలడం ద్వారా నోటి దుర్వాసన పోయి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పుదీనాలోని నూనెలు తాజా స్వాసను కలిగిస్తాయి. దీని ద్వారా చిగుళ్ళు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధన ప్రకారం పుదీనా ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మెదడులోని అన్ని భాగాలు చురుకుగా పనిచేస్తాయి.

మీరు గనుక జలుబుతో బాధపడుతూ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అయితే పుదీనా ఆ సమస్యను దూరం చేస్తుంది. శ్వాస కోసం వ్యాధుల నివారణకు ఆవిరి పట్టడం, ఇన్ హెలర్లలో పుదీనా ఉంటుంది. ఇది ముక్కు, గొంతు, శ్వాసనాళ్ళం, ఊపిరితిత్తుల మార్గాన్ని శుభ్రపరిచి దీర్ఘకాలిక దగ్గును దూరం చేస్తుంది. కడుపులో కాస్త వికారంగా ఉన్నట్లయితే పుదీనా ఆకులు తినడం లేదా నలిమి వాసన చూడడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.