మిల్క్ టీ ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ టీ వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది మిల్క్ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. రోజూ పాలతో టీ తాగడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని చాలామంది భావిస్తారు. అయితే మిల్క్ టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. రోజుకు రెండుసార్ల కంటే టీ లేదా కాపీని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పవచ్చు.

మిల్క్ టీని ఎక్కువగా తాగితే ముఖం ఉబ్బినట్టు అనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ టీ తాగడం వల్ల శరీరం పొడిబారే అవకాశాలు అయితే ఉంటాయి. మిల్క్ టీ ఎక్కువగా తాగితే శరీరం డీ హైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువగా మిల్క్ టీ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

టీ ఎక్కువగా తాగేవాళ్లు ఆందోళనతో బాధ పడే అవకాశాలు అయితే ఉంటాయి. టీలో ఉండే కెఫీన్ వల్ల నిద్ర సంబందిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. టీ ఎక్కువగా తాగేవాళ్ల బ్లడ్ ప్రెజర్ లో ఇమ్ బ్యాలన్స్ ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మిల్క్ టీ ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిల్క్ టీ కొన్నిసార్లు డీ హైడ్రేషన్ కు కారణమవుతుంది.

మిల్క్ టీ సమస్యతో ఎక్కువగా బాధ పడేవాళ్లను మొటిమల సమస్య కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మిల్క్ టీ దుష్ప్రభావాల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మిల్క్ టీ జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మిల్క్ టీ ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.