మతిమరపు సమస్యతో బాధపడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

మనలో చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలలో మతిమరపు సమస్య కూడా ఒకటి. ఈ సమస్య వల్ల నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మతిమరపు సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. విభిన్న రకాల జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుండటం గమనార్హం.

ఊబకాయం వల్ల చాలామందిని మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. మతిమరపు సమస్య కూడా సాధారణ సమస్యగా మారింది. వస్తువులను, చిన్నచిన్న విషయాలను మరిచిపోవడం సాధారణంగా జరుగుతుంది. మెదడు సామర్ధ్యాన్ని పెంచుకోవడం ద్వారా జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

హెర్బల్ టీ తాగడం ద్వారా మెమొరీ పవర్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. హెర్బల్ టీ తాగడం వల్ల మెదడు పనీతీరు మెరుగుపడుతుంది. తులసి, పసుపు, వాము, హింగ్ కలిపి స్వయంగా హెర్బల్ టీ తయారు చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బాదం, కిస్మిస్, ఖర్జూరం, నెయ్యి, జైతూన్ ఆయిల్, పప్పులు, బీన్స్, పన్నీర్, నల్ల మిరియాలు, జీలకర్ర తీసుకోవడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది.

రోజుకు కనీసం 78 గంటల రాత్రి నిద్ర కచ్చితంగా ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. సూర్యోదయానికి ముందు లేవడం అలవాటు చేసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పవచ్చు. శరీరంలో ఆక్సిజన్ సరైన మోతాదులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రెడ్, పింక్ కలర్ ఫ్రూట్స్, కూరగాయలు, పుచ్చకాయ, టొమాటో తీసుకోవడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

అశ్వగంధ, బకోపా, ధూతి, నెయ్యి తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. క్రమపద్ధతిలో ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ అద్భుతమైన చిట్కాలను పాటించడం ద్వారా మతిమరుపు సమస్య దూరమవుతుంది. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదిస్తే మంచిది.