ఈ రోజుల్లో సెక్స్ సంబంధించిన సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందంటూ అనేక సర్వేలో స్పష్టమైంది. దీని కారణంగానే అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. మనుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గడానికి మన జీవన విధానంలో క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు ,పని ఒత్తిడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంటివి ప్రధానంగా చెప్పవచ్చు. కొందరు శృంగార వాంఛను పెంచుకోవడానికి మార్కెట్లో దొరికే ఏవేవో ప్రొడక్ట్స్ వాడుతూ తీవ్ర అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు.
మీరు కూడా సెక్స్ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటిస్తే మీలో లైంగిక వాంఛను పెంపొందించుకోవచ్చు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కొన్ని ఔషధ మూలికలను ఉపయోగించి కషాయ రూపంలో సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. కషాయాన్ని ఎలా తయారు చేయాలి కావలసిన పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.టీ స్పూన్ కుంకుమ పువ్వు,టీ స్పూన్ అశ్వగంధ పౌడర్,మూడు యాలకులు,దమానియా ఆకులను,రెండు చిటికెల్ నట్ మగ్, ఎండిపోయిన గులాబీ రేకులు,మందార పూరేకులు వీటన్నిటిని సేకరించి పొడిగా మార్చి గాలి తగలని జార్లో నిలువ చేసుకోవాలి.
మనం తయారు చేసుకున్న పొడిని కావాల్సిన పరిమాణంలో నీళ్లల్లో వేసుకొని బాగా మరగనివ్వాలి తర్వాత వడగట్టి అందులో కొంత తేనెను కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే మీలో లైంగిక సామర్థ్యం పెరిగి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఇందులో ఉండే కుంకుమ పువ్వు అంగస్తం మన సమస్యలను తొలగించి మీలో కామ వాంఛను పెంచుతుంది. అశ్వ గంధ మానసిక ఒత్తిడిని తొలగించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.దమానియా ఆకులను ఉపయోగించడం వల్ల కామోద్దీపన పెరిగి సంతానలేమి సమస్యను దూరం చేస్తుంది.పానీయాన్ని ప్రతిరోజు సేవించడం వల్ల సెక్స్ సంబంధించిన సమస్యలు తొలగిపోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.