కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఆహార పదార్థాల విషయంలో కొంత మేర జాగ్రత్తలను తీసుకుంటున్నారు. తరచూ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వంటివి కాకుండా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చెబుతున్నారు అయితే పోషక విలువలు మెండుగా ఉన్నటువంటి వేరుశనగలను మాత్రం చాలా మంది దూరం పెడుతున్నారు. వేరుశనగలలో కొవ్వు శాతం అధికంగా ఉండటం వల్ల చాలామంది వేరుశనగలను అధికంగా తీసుకుంటే అధిక శరీర బరువు పెరిగిపోతారన్న అపోహతో పూర్తిగా వారి ఆహార విషయంలో వేరుశనగలను దూరం పెడుతున్నారు.
ఇలా వేరుశనగలను దూరం పెట్టేవారు ఇది కనుక తెలుసుకుంటే క్రమం తప్పకుండా మీ ఆహారంలో వేరుసెనగలు ఉండేలా చూసుకుంటారు. వేరుశెనగ గింజలలో ఎక్కువగా కొవ్వులు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు విటమిన్లు ఐరన్ జింక్ మెగ్నీషియం అంటే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే క్రమం తప్పకుండా వేరుశనగలను తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ మన సొంతమవుతాయి.
వేరుశనగలలో ప్రోటీన్లు పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల వీటిని కొద్ది పరిమాణంలో తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా మనకు ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. ఇందులో ఉన్నటువంటి పీచు పదార్థాలు శరీరంలో జీర్ణ క్రియలను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి.అదేవిధంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు గుప్పెడు పల్లిలను తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.