మన భారతీయ వంటకాలలో టమోటా లేనిదే వంటలు చేయము. వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో టమోటా ఒకటి. ఇలా టమోటాలతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే టమోటాలు కేవలం వంటకు రుచి మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. ఈ క్రమంలోనే టమోటాలలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెర, పీచు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి వంటివి శరీరానికి పుష్కలంగా ఉంటాయి.
పోషక విలువలు కలిగినటువంటి టమోటాలను పరగడుపున తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.టమోటాలను పరగడుపున తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…సాధారణంగా మన కడుపులో హానికర బ్యాక్టీరియాలో ఏర్పడటం సర్వసాధారణం అయితే పరకడుపున పసుపుతో కలిసే టమోటాలను తినడం వల్ల ఈ బ్యాక్టీరియాలను నశింప చేస్తుంది. అదేవిధంగా కడుపులో మంట అనే సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు పరగడుపున టమోటాలు తినడం ఎంతో మంచిది.
ఇక చర్మంపై చిన్నపాటి దద్దుర్లు ఇతర చర్మ సమస్యలు ఉన్నవారు కూడా ఉదయం చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా గుండె పోటు సమస్య ఉన్నవారు కూడ టమోటా తినడం వల్ల స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం తగ్గిపోతుందని అలాగే ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఏ కారణంగా దృష్టిలోపం తగ్గి కంటి చూపు మెరుగు పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.కేవలం ఆహార పదార్థాలకు రుచి రావడమే కాకుండా మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.