మీరు ఈ వ్యాధులతో బాధపడుతున్నారా…. బెండకాయను దూరం పెట్టాల్సిందే!

మనం నిత్యం వంటలలో ఉపయోగించే కూరగాయలలో బెండకాయ ఒకటి బెండకాయను తినడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ఇష్టపడతారు బెండకాయతో వివిధ రకాల వంటలను తయారు చేసుకున్న తింటారు ఇందులో పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి.
ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు A, C, E, K, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటితోపాటు యాంటీ అల్సర్ యాంటీ క్యాన్సర్ మొదలైన లక్షణాలు బెండకాయలో పుష్కలంగా లభిస్తాయి.

ఇలా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి బెండకాయను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం బెండకాయ దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ ఏ రకాల సమస్యలతో బాధపడేవారు బెండకాయను దూరంగా పెట్టాలి అనే విషయానికి వస్తే…ఎవరైతే మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు బెండకాయకు పూర్తిగా దూరంగా ఉండాలి. అదేవిధంగా పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు కూడా బెండకాయను దూరం పెట్టాలి.

ఎవరైతే ఉబ్బసం సమస్యతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలి. గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, దగ్గు, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు బెండకాయ తినడం మానుకోండి. ఈ సమస్యలతో బాధపడేవారు బెండకాయను తినడం వల్ల సమస్య మరింత అధికమవుతుంది.