అధిక ఒత్తిడితో మానసిక ప్రశాంతత లోపిస్తోందా… ఒత్తిడిని జయించే మార్గాలు ఇదిగో?

మారుతున్న కాలానికి అనుగుణంగా మన రోజువారీ కార్యకలాపాల్లో సమూలమైన మార్పులు వస్తున్నాయి. దాంతో మన వృత్తి రీత్యా శ్రమించే సమయం పెరిగిపోయి, విశ్రాంతి తీసుకునే సమయం తగ్గడం వల్ల
శారీరకంగా అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తి
తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాం.దానికి తోడు ఆరోగ్య కారణాలు, ఆర్థిక కారణాలు, వ్యక్తిగత కారణాలు తోడవడంతో మానసికంగాను శారీరకంగాను తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని రక్తపోటు, అల్జీమర్ ,గుండె జబ్బులు,డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.వృత్తిరీత్యా మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తే తీవ్ర ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మానసిక ,శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉదయాన్నే కొంత శారీరిక శ్రమ కలిగిన యోగ, నడక, వ్యాయామము వంటివి అలవాటు చేసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యం పెంపొంది రోజంతా మిమ్మల్ని చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటే సరిపోతుంది.

తీవ్ర మానసిక ఒత్తిడి గురైనప్పుడు వేడివేడి గ్రీన్ టీ ని సేవిస్తే మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. గ్రీన్ టీ లో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను ఉత్తేజపరిచి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని జయించడానికి పజిల్ గేమ్స్ చక్కగా ఉపయోగపడతాయి. తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు మనసును డైవర్ట్ చేయడానికి పజిల్ గేమ్స్ వంటివి అలవాటు చేసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.

మనము మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సంగీతాన్ని ఇంతే మనసును ప్రశాంతంగా మారుస్తుంది. దాంతో ఒత్తిడి ఆందోళనలు తగ్గి మళ్లీ చురుగ్గా పనిచేసుకోగలుగుతారు. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన స్నేహితులు లేదా బంధువులతో ఫోన్లో కానీ లేదా డైరెక్ట్ గా కలిసి మాట్లాడితే ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.