ఆ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడుతున్నారా.. శృతి మించి వాడితే ప్రాణాలకు ప్రమాదమంటూ?

మనలో చాలామంది ఏదో ఒక విటమిన్ లోపంతో బాధ పడుతూ ఉంటారు. ఈ సమస్యను అధిగమించడానికి కొంతమంది విటమిన్ ట్యాబ్లెట్లపై ఆధారపడుతున్నారు. విటమిన్ ట్యాబ్లెట్లు వాడటం ఆరోగ్యానికి మంచిదే అయినా పరిమితంగా వాడితే మాత్రమే హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో విటమిన్ ట్యాబ్లెట్లు వాడటం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువని చెప్పవచ్చు.

ఇన్ఫెక్షన్లకు భయపడి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి చాలామంది ట్యాబ్లెట్లపై ఆధారపడుతున్నారు. మోతాదుకు మించి విటమిన్ ట్యాబ్లెట్లను వాడితే శరీరానికి నెగిటివ్ గా జరుగుతుంది. శరీరంలో విటమిన్ల స్థాయి ఎక్కువైతే కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. విటమిన్ల స్థాయి ఎక్కువైతే కడుపు సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి.

గొంతు నొప్పి, అలసట లాంటి సమస్యలకు సైతం ఈ ట్యాబ్లెట్లు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది. శరీరంలో విటమిన్ ఎ మోతాదు పెరిగితే కంటికే నష్టమని వైద్యులు చెబుతున్నారు. ఆహారం ద్వారా విటమిన్లు అందితే లాభమని ట్యాబ్లెట్ల ద్వారా విటమిన్లు అందడం వల్ల నష్టమని వైద్యులు చెబుతున్నారు. విటమిట్-డి ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడితే శరీరంలో క్యాల్షియం లెవెల్స్ పెరుగుతాయి.

కూరగాయలు, పప్పుదినుసులు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు సులభంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్ ట్యాబ్లెట్లు కొన్నిసార్లు శరీర అవయవాలపై ప్రభావం చూపుతాయి. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా విటమిన్ ట్యాబ్లెట్లన్ వాడటం ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు.