మనలో చాలామంది ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ అయితే ఉంటుందని భావిస్తారు. అయితే మనం ఎక్కువగా ఉపయోగించే చిరు ధాన్యాలలో అరికెలు ఒకటి కాగా అరికెలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. అరికెలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
అరికెలలో క్యాల్షియం, ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు, ఐరన్ ఉంటాయని చెప్పవచ్చు. అరికెలను తరచూ తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అరికెలు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఇవి సహాయపడతాయని చెప్పవచ్చు.
శరీరంలో రక్తపోటును అదుపులో ఉంచే విషయంలో అరికెలు తోడ్పడతాయి. నిద్రలేమి సమస్యతో బాధ పడేవాళ్లు అరికెలు తీసుకోవడం ద్వారా ఆ సమస్య కూడా దూరమయ్యి ఛాన్స్ ఉంటుంది. అరికెలలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గిస్తుంది. మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గించటంతోపాటుగా, గుండె జబ్బులు వంటి తీవ్రమైన దుష్పరిణామాలు ఏర్పడకుండా తగ్గించడంలో అరికెలు తోడ్పడతాయి.
శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని అరికెలు తగ్గిస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలతో బాధపడుతున్నవారు అరికెలను తీసుకుంటే త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది. అధికమొత్తంలో మినరల్స్, విటమిన్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిందే అవకాశం ఉంటుంది.
