మనలో చాలామంది చెప్పులు లేకుండా నడవటానికి అస్సలు ఇష్టపడరు. చెప్పులు లేకుండా నడిస్తే అసౌకర్యంగా ఉంటుందని చాలామంది ఫీలవుతారు. అయితే వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చెప్పులు లేకుండా నడిస్తే పొత్తికడుపుపై ఒత్తిడి కలిగి, జీర్ణక్రియ సక్రమంగా ఉంటుందని చెప్పవచ్చు.
చిన్నచిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల రక్త ప్రసరణ సమస్యలు దూరమవుతాయి. చెప్పులు లేకుండా నడిస్తే బీపీ అదుపులో ఉంటుందని చెప్పవచ్చు. చెప్పులు లేకుండా భూమి పైన నడవడం వల్ల సహనం పెరిగే ఛాన్స్ ఉంటుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల నరాల కొనలు చురుకుగా పని చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తుంటి, మోకాళ్లు, వీపులో నొప్పి లాంటి సమస్యలు చెప్పులు లేకుండా నడవడం వల్ల దూరమవుతాయి.
చెప్పులు లేకుండా నడవడం ద్వారా నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఇలా నడవడం వల్ల శరీరం రిలాక్స్ కావడంతో పాటు త్వరగా నిద్ర పట్టే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. చెప్పులు లేకుండా నడిస్తే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని వైద్యులు సైతం వెల్లడిస్తున్నారు. చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ల కండరాలు స్ట్రాంగ్ కావడంతో పాటు ఎముకలపై ఒత్తిడి తగ్గుతుంది.
చెప్పులు లేకుండా నడవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చెప్పులు లేకుండా నడవడం ద్వారా కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. పార్క్‌లో గడ్డి మీద ఉత్తి కాళ్లతో నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు.