Water from eyes: పిల్లల కళ్ళ నుంచి తరచూ నీళ్లు కారుతున్నాయా… నిర్లక్ష్యం అస్సలు చేయకండి?

Water from eyes: చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లలకు వచ్చే సమస్య ఏంటి అనేది వారు నోటితో చెప్పలేరు కనుక ప్రతి ఒక్క విషయంలోనూ తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇకపోతే చాలామంది చిన్న పిల్లలు వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వాటిలో చాలామందికి కళ్ళల్లో నుంచి తరచు నీళ్లు కారుతూ కళ్ళు ఎరుపుగా ఉంటాయి.

ఇలా కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి అయితే ఇది సర్వసాధారణం అని తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఇలా పిల్లల కళ్ళ నుంచి తరచూ నీళ్లు కారుతున్నాయి అంటే అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇలా చిన్న పిల్లల కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి అంటే వారి కళ్ళు బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా కళ్ళ నుంచి నీళ్లు కారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .తద్వారా కళ్ళు కూడా ఎరుపుగా మారడం మంట ఉంటుంది.

జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ శిశువులలో కళ్ల నుండి నీరు కారడానికి దారితీస్తుంది. ఇక చాలామంది పిల్లలలో అభివృద్ధి చెందని కన్నీటి నాళాలు ఉంటాయి. ఇవి పుట్టిన తర్వాత చాలా నెలల వరకు పూర్తిగా తెరుచుకోవు. కన్నీటి వాహిక పాక్షికంగా నిరోధించబడితే, కన్ను, ముక్కు మధ్య సున్నితమైన మసాజ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక కొన్నిసార్లు ఇంటి ఆవరణంలో పెరిగే మొక్కల పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువుల కారణంగా కూడా అలర్జీలకి గురి అవుతూ నీళ్లు కారే అవకాశాలు ఉంటాయి. ఇక దుమ్ము ధూళి వల్ల కూడా పిల్లల కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.