ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యం కావడం లేదు. నీరసం, అలసట సమస్యలతో బాధ పడేవాళ్లకు ప్రయోజనం చేకూరేలా కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. ఎవరైతే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ సమస్యతో బాధ పడుతూ ఉంటారో వాళ్లు విపరీతమైన అలసటతో బాధపడే అవకాశం ఉంటుంది.
హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, ఇతర కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కీళ్ల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి సమస్యలతో పాటు ఏకాగ్రత తగ్గడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, కండరాలు, అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి లాంటి సమస్యలు వేధిస్తుంటే ఈ సిండ్రోమ్ గా గుర్తించాల్సి ఉంటుంది. ఒత్తిడి తగ్గించుకోవడం, ప్రశాంతమైన నిద్ర, అధిక శ్రమను నివారించడం, సమతుల్య జీవనశైలితో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అధిక శ్రమ వల్ల ఈ సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. శారీరక శ్రమ తగ్గించుకోవడం, పనులను విభజించుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవసరమైనప్పుడు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుంది. ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
మైండ్‌ఫుల్‌నెస్, యోగా, నచ్చిన పనులు చేయడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. సరిపడా నీళ్లు తాగడం, సున్నితమైన వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.