ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాల కారణంగా ప్రతి ఒక్కరు అజీర్తి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.అలాగే మరికొందరు మలబద్ధక సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు ఇలాంటి అజయ్ సమస్యలతో బాధపడేవారు వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం తరచూ మన పొట్టను శుభ్రం చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు అయితే ఇలా సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే మన ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసుకుని ఈ చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చిటికెడు తీసుకోవడం వల్ల ఉదయానికంతా మన పొట్ట శుభ్రం అవుతుంది.
ఇంట్లోనే ఈ చూర్ణం తయారు చేసుకోవడానికి జీలకర్రను, వామును, సోంపు గింజలను, నల్ల ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. కళాయిలో రెండు టీ స్పూన్ల వామును, రెండు టీ స్పూన్ల జీలకర్రను తీసుకోవాలి. తరువాత వీటిని చిన్న మంటపై 2 నిమిషాల పాటు వేయించి ఒక గిన్నెలో వేసుకోవాలి అనంతరం ఇందులోకి సోంపు గింజలు నల్ల ఉప్పును వేసి మెత్తని మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాలి దూరనటువంటి ఒక గాజు సీసాలు భద్రపరుచుకోవాలి.
ఈ విధంగా తయారు చేసుకున్న ఈ చూర్ణం రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు గోరువెచ్చని గ్లాసులో చిటికెడు కలిపి తాగాలి ఇలా తాగటం వల్ల ఉదయానికల్లా మన శరీరంలో జీర్ణ వ్యవస్థతో పాటు ప్రేగుల్లో పేరుకుపోయిన మలం అంతా తొలగిపోతుంది. ప్రేగులు శుభ్రపడతాయి. ఆకలి బాగా వేస్తుంది. అజీర్తి సమస్య తలెత్తకుండా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.