సాధారణంగా మహిళలకు ప్రసాదం అయిన తర్వాత వారి పొట్టపై భాగంలో స్ట్రెచ్ మార్క్స్ పడి చాలా ఇబ్బంది పడుతుంటారు. చూడటానికి ఈ మార్క్స్ చాలా అభ్యంతరకరంగా ఉండటంవల్ల స్ట్రెచ్ మార్క్ పోగొట్టుకోవడానికి ఎన్నో రకాల ఆయింట్మెంట్స్ ఉపయోగిస్తున్న ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు. అయితే ఇవి కేవలం మహిళలలో ప్రసాదమైన తర్వాత మాత్రమే కాకుండా చాలా మంది శరీర బరువు పెరిగి ఉన్నఫలంగా బరువు తగ్గడం వల్ల కూడా వారి పొట్టపై భాగంలోను ఇలాంటి స్ట్రెచ్ మార్క్స్ కనబడుతూ ఉంటాయి అయితే ఈ సమస్యకు చక్కటి పరిష్కారం జామ ఆకులు.
మన ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి జామ ఆకులను శుభ్రంగా కడిగి వీటిని మెత్తని మిశ్రమంల తయారు చేయాలి. ఇలా మిశ్రమంలో తయారు చేసుకున్న జామ ఆకులను మనకు ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో అక్కడ మొత్తం ఈ మిశ్రమాన్ని రాయాలి ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల పొట్టపై ఉన్నటువంటి ఈ
స్ట్రెచ్ మార్క్స్ మొత్తం తొలగిపోతాయి.
జామ ఆకులో ఉన్నటువంటి లైకోపిన్ చర్మం పై ఉండే చారలను తగ్గించడంలో అలాగే చారలు భవిష్యత్తులో ఏర్పడకుండా చేయడంలో దోహదపడతాయి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల జామ ఆకుల పేస్ట్ లో కొద్దిగా కలబంద గుజ్జు, ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చారలపై రాసి మర్దనా చేసిన అరగంట తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయటం వల్ల పొట్టపై ఉన్నటువంటి ఈ చారలు తొలగిపోతాయి.