నిరుద్యోగులకు తీపికబురు.. బీఈడీ అవసరం లేకుండా 4062 టీచర్ ఉద్యోగాలు?

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా 4062 ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ వెలువడింది. అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రిన్సిపాల్, పీజీటీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రిన్సిపాల్ ఉద్యోగ ఖాళీలు 303 ఉండగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు 2,266 ఉన్నాయి. ప్రిన్సిపాల్ పోస్టులకు 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారని సమాచారం.

అకౌంటింగ్ విభాగంలోని ఉద్యోగాలకు 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు సైతం 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 18000 రూపాయల నుంచి 2,09,200 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది.

ఈ ఉద్యోగ ఖాళీలలో కొన్ని ఉద్యోగ ఖాళీలకు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. https://examinationservices.nic.in/recsys23/root/home.aspx?enc=zynep5el4kuxqgkdvi0llw8cf31bjte33crxv1asgeu151dxalj+m7bbkol67wfk లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది.