ముల్లంగి తో కలిపి వీటిని తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే?

ముల్లంగిని తరచూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు కంటి చూపును చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతోపాటు గుండె జబ్బు, రక్తపోటు, డయాబెటిస్ ,మలబద్ధకం, గ్యాస్ట్రిక్, ఉదర క్యాన్సర్, వంటి ఎన్నో రకాల వ్యాధులను అదుపులో ఉంచవచ్చు.అలాగే విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ క్యాల్షియం, మెగ్నీషియం ,సోడియం, ఐరన్ వంటి మూలకాలతో పాటు సమృద్ధిగా ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కావున ముల్లంగి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ముల్లంగిని తిన్న వెంటనే కొన్ని పదార్థాలను అసలు తినకూడదు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.ముల్లంగి కూర తిన్న వెంటనే పాలు తాగితే మన శరీరంలో యాసిడ్ రిఫ్లక్స్ వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని కడుపులో మంట,తేపులు, గుండెల్లో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.సాధారణంగా ముల్లంగిని చేదు రుచి కలిగిన ఎటువంటి పదార్థంతోను కలిపి తినకూడదు. ముల్లంగిలో ఉండే సహజ ఔషధ గుణాలు చేదుతో కలిసినప్పుడు గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

ముల్లంగిని తిన్న వెంటనే పాలు,టీ, కాఫీ వంటి పానీయాలను సేవిస్తే జీర్ణశక్తి మందగించి మలబద్ధక సమస్య తలెత్తవచ్చు. ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.నారింజ, బత్తాయి, కివి బొప్పాయి పండ్లను తిన్న వెంటనే ముల్లంగిని ఆహారంగా తీసుకుంటే ఈ రెండిటి కలయిక మన శరీరంలో విషం గా మరి తీవ్ర అనారోగ్యానికి కారణం కావచ్చు. అలాగే కీర దోసకాయతో కలిపి ముల్లంగిని తింటే డిహైడ్రేషన్ సమస్య తలెత్తి తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ముల్లంగి ఆహారంగా తీసుకున్న రోజు ఎక్కువగా నీళ్లను తాగాలి లేకపోతే డిహైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు.