శరీర బరువును తగ్గించుకోవాలంటే అల్పాహారంలో ఈ మార్పులు చేసుకుంటే సరిపోతుంది!

ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవలసినది శరీర బరువు తొందరగా పెరగడం.దీని ఫలితంగా ఉబకాయం, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు వంటి సమస్యలను చిన్న వయసులోనే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ఫలితంగా కెరియర్ పై దృష్టి సాధించలేక జీవిత గమనంలో వెనుకబడిపోతున్నారు. శరీర బరువును సహజ పద్ధతిలో నియంత్రించుకోవడానికి రోజువారీ అల్పాహారం కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారు శరీర బరువును నియంత్రించుకోవడానికి అల్పాహారం తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ టీ వంటి పానీయాన్ని సేవిస్తే మీ శరీరానికి చక్కర రూపంలో అదనపు క్యాలరీలు లభించి శరీర బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది కావున శరీర బరువును నియంత్రించే శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండే గ్రీన్ టీ ని సేవిస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి శరీర బరువును అదుపులో ఉంచుతాయి.

ప్రతిరోజు గుడ్డును ఆరంగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుందన్న భయంతో గుడ్డును ఆహారంగా తీసుకోవడానికి చాలామంది సంకోచిస్తుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు గుడ్డును ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే సహజ పోషక పదార్థాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా శరీర బరువును సహజ పద్ధతిలో తగ్గించుకోవచ్చు.

అలాగే ఉదయం అల్పాహారంలో అత్యధిక కొవ్వు కలిగిన టిఫిన్స్ కు బదులు గోధుమలు, జొన్న, రాగి వంటి చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే వీటిల్లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్స్,అమైనో ఆమ్లాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలను పెరగనివ్వకుండా సహాయపడతాయి.మరియు అత్యధిక ఫైబర్ కలిగిన ఆరెంజ్ ,బత్తాయి,కివి, పైనాపిల్, ద్రాక్ష వంటి పండ్ల రసాలను సేవిస్తే శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయి.