రోజు పరగడుపున ఈ కషాయం తాగితే చాలు.. ఈ ప్రయోజనాలన్నీ మీ సొంతం?

మన వంటింట్లో నిత్యం లభించే ఎన్నో మసాలా దినుసుల ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.ఈ విధంగా మన వంటింట్లో దొరికే దాల్చిన చెక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు.దాల్చిన చెక్కను కేవలం వంటలలో ఉపయోగించడం వల్ల వంటకు మరింత రుచి వస్తుందనే విషయం చాలామందికి తెలిసినప్పటికీ ఇందులో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ప్రతిరోజు ఉదయం పరగడుపున దాల్చిన చెక్క కషాయం తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. మరి దాల్చిన చెక్క కషాయం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

స్టవ్ మీద ఒక గిన్నెలో గ్లాసు నీటిని పోసి అందులో మూడు దాల్చిన చెక్కలు వేసి పది నిమిషాల పాటు సన్నని మంటపై బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీరు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత నీటిని వడబోసుకొని అందులో మనకు రుచి కోసం కాస్త తేనె కలుపుకొని రోజు పరగడుపున తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఎన్నో రకాల హానికర బ్యాక్టీరియాలను నాశనం చేయడం కోసం మన శరీరానికి కావాల్సినంత రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది.

అజీర్తి, గ్యాస్, మలబద్దకం, ఎసిడిటి వంటి సమస్యలతో బాధపడే వారికి దాల్చిన చెక్క ఎంతగానో సహాయపడుతుంది.ఇక ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నటువంటి సమస్యలలో అధిక శరీర బరువు సమస్య ఒకటి. అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం ఈ కషాయం తాగటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగించి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది.కొలెస్ట్రాల్ కరగటం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇక దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల చర్మం ఎంతో నిగారింపుగా తయారవుతుంది.