చెడు కొలెస్ట్రాల్ ను సులువుగా కరిగించాలా.. కచ్చితంగా పాటించాల్సిన చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో చాలామంది ఊబకాయం వల్ల బాధ పడుతున్నారు. మరోవైపు గుండె సంబంధిత సమస్యల బారిన పడి మరణిస్తున్న వాళ్ల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది. అయితే చెడు కొలెస్ట్రాల్ ను సులువుగా కరిగించాలని భావించే వాళ్లు కొన్ని టిప్స్ ను పాటించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను కరిగించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ఎన్నో సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్లు చెడు కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చెడు కొలెస్ట్రాల్ బీపీ, షుగర్, ఆర్థరైటిస్, ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పండ్లు తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను సులువుగా తగ్గించవచ్చు.

 

ఆవకాడో, ఆరెంజ్, జామ, స్ట్రాబెరీ పండ్లను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే అవకాశం ఉంటుంది. తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లను తీసుకోవడం ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చు. ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బార్లీ, రాగిజావ తీసుకోవడం ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుంది.

 

బీన్స్ తినడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు శరీరానికి అవసరమైన ఫైబర్ లభిస్తుంది. డైట్ లో మార్పులు చేసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు.