కామెర్లు – కాలేయ సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ ఆహార నియమాలతో సమస్యకు చెక్ పెట్టండి!

మానవ శరీరంలోని రక్తంలో ఎర్రకణాల విచ్చిత్తి జరుగుతూ బిలురూబిన్ అనే పదార్థం తయారవుతూ ఉంటుంది. రక్తంలో ఈ బిలురూబిన్ పదార్థం రెట్టింపు అయితే కామెర్లు అని నిర్ధారిస్తారు. దీనినే జాండీస్ అని కూడా పిలవడం జరుగుతుంది.

ఈ కామెర్లు వచ్చినవారి చర్మం, కళ్ళు పసుపు పచ్చ రంగులో కనిపిస్తాయి. ముఖ్యంగా జాండీస్ ఇన్ఫెక్షన్లను ఐదు రకాలుగా వర్గీకరించారు. హైపటైటిస్- ఏ, బి, సి, డి, ఇ లుగా పిలుస్తారు. ఇందులో హైపటైటిస్ ఏ, ఇ లు కలుషిత నీరు, ఆహార పదార్థాల ద్వారా సంక్రమిస్తుంది.

హైపటైటిస్ బి, సి, డి లు రక్త మార్పిడి ద్వారా, ఒకరికి వాడిన ఇంజక్షన్ సూదులు ఇతరులకు వాడడం ద్వారా, సెక్స్ ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంది. పచ్చకామెర్లతో బాధపడుతున్న వారికి వేప ఆకు ఒక మంచి ఔషధం. ఇందులో యాంటీవైరస్ లక్షణాలు ఉన్నాయి.

వేపాకుతో తేనెను కలిపి ఒక వారం రోజులు ఆహారంగా తీసుకుంటే కామెర్లు పూర్తిగా తగ్గిపోతాయి. టమాటాలు లైకోపిన్ అనే పదార్థం పుష్కలంగా ఉండడం ద్వారా ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

కామెర్లు ఉన్నవారికి ఉదయం పరిగడుపున ముల్లంగి జ్యూస్ తీసుకున్నట్లయితే పచ్చకామెర్లు తొందరగా తగ్గిపోతాయి. బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయ సమస్యలతో బాధపడే వారికి ఇది మంచి ఔషధం. కాలేయానికి చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. అందుకే కామెర్లు వచ్చిన సందర్భంలో చెరుకు రసం ఎక్కువగా త్రాగమని సూచిస్తారు.

పాలకూర కామెర్లతో బాధపడే వారికి ఒక మంచి ఆహారం ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల లివర్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చకామెర్ల వల్ల కాలేయం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. సమస్య ఎక్కువైనప్పుడు డాక్టర్ ను సంప్రదించి, సలహాలు పాటిస్తే మంచిది.